పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా యువ దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 ఏడి. మొదటి నుండి అందరిలో భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుని ఇపటివరకు ఉన్న అంచనాలు అమాంతం పెంచేసింది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న కల్కి మూవీని వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు.
ఇక ఈ సినిమాని రానున్న 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నట్లు కొన్ని నెలల క్రితం మేకర్స్ ప్రకటించారు. కాగా మ్యాటర్ ఏమిటంటే, తాజాగా ఈ మూవీ రిలీజ్ పై ఒక మీడియా ఇంటర్వ్యూ లో భాగంగా క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ నాగ అశ్విన్. ఆయన మాట్లాడుతూ, ప్రభాస్ గారు హీరోగా తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడి కోసం తమ టీమ్ మొత్తం ఎంతో శ్రమిస్తోందని, కొంత మేర షూటింగ్ మిగిలి ఉండడంతో అది పూర్తి అయిన అనంతరం త్వరలో అధికారికంగా తమ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని తెలిపారు. అయితే ఈ మూవీ మే 9ని రిలీజ్ కానుందని తాజా టాలీవుడ్ బజ్.


