పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా దగ్గర బిగ్గెస్ట్ ట్రీట్ ఇచ్చే చిత్రంగా ఇది రాబోతుండగా ఈ చిత్రాన్ని మాత్రం మేకర్స్ అనుకున్న దానికంటే భారీ స్థాయిలో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.
మెయిన్ గా అయితే మూవీ లవర్స్ సాలిడ్ ట్రీట్ ఇచ్చే విధంగా వరల్డ్ వైడ్ మాసివ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం ఐమ్యాక్స్ వెర్షన్ రిలీజ్ పై కూడా గత కొంత కాలం నుంచి మంచి బజ్ అయితే ఉంది. ఇక లేటెస్ట్ గా అయితే దీనిపై అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది.
యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ సలార్ చిత్రం ఐమ్యాక్స్ వెర్షన్ రిలీజ్ ని కన్ఫర్మ్ చేయగా దీనితో అయితే వరల్డ్ వైడ్ గా కూడా సలార్ ఐమ్యాక్స్ స్క్రీన్స్ లో అద్దిరిపోయే ట్రీట్ ని ఇవ్వబోతుంది అని కన్ఫర్మ్ అయ్యిపోయింది. మొత్తానికి అంటే నీల్ అండ్ టీం ఓ బిగ్గెస్ట్ ట్రీట్ ని ప్రామిస్ చేస్తున్నారు అన్ని చెప్పొచు.


