కోలీవుడ్ గ్లోబల్ హీరో ధనుష్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “కెప్టెన్ మిల్లర్” కోసం అందరికీ తెలిసిందే. మరి దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కించిన ఈ చిత్రం పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించగా సినిమా టీజర్ అయితే అయితే సెన్సేషనల్ హైప్ లేచింది.
ఇక ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ అవుతుండగా లేటెస్ట్ గా అయితే ఈ క్రేజీ కాంబినేషన్ నుంచి రెండో చిత్రంపై ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ అనౌన్సమెంట్ వచ్చేసింది. కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఉందర్బర్ ఫిల్మ్స్ సంస్థ అయితే దర్శకుడు అరుణ్ మాతేశ్వర్ తో అలాగే హీరో ధనుష్ తో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నట్టుగా ఇప్పుడు తెలపగా ధనుష్ కూడా తాను ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ కన్ఫర్మ్ చేసాడు. దీనితో ఈ క్రేజీ కాంబినేషన్ కెప్టెన్ మిల్లర్ అనంతరం మరోసారి రాబోతుంది అని చెప్పాలి.
Looking forward ♥️@ArunMatheswaran @wunderbarfilms https://t.co/wNowlrwJ4p
— Dhanush (@dhanushkraja) August 20, 2023


