కింగ్ అక్కినేని నాగార్జున నెక్స్ట్ మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఘోస్ట్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు నాగార్జున. అయితే ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక తన నెక్స్ట్ మూవీని విజయ్ బిన్నీ దర్శకత్వంలో చేసేందుకు నాగార్జున రెడీ అయినట్లు తెలుస్తోంది.
నాగశౌర్య నటించిన ఛలో, ధనుష్ నటించిన సార్ సినిమాలకు కొరియోగ్రఫి అందించి మంచి పేరు సొంతం చేసుకున్న బిన్నీ తొలిసారిగా మెగా ఫోన్ పడుతున్న ఈ మూవీని శ్రీనివాస చిట్టూరి, పవన్ నిర్మిస్తుండగా ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించనున్నారట. అయితే విషయం ఏమిటంటే, ఆగష్టు 29న అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. అలానే అదే రోజున సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కూడా వెల్లడి కానున్నాయి.


