ట్రైలర్ రిలీజ్ కి రెడీ అవుతోన్న రామ్ ‘స్కంద’ ?

ట్రైలర్ రిలీజ్ కి రెడీ అవుతోన్న రామ్ ‘స్కంద’ ?

Published on Aug 24, 2023 8:30 AM IST

Skanda 3

తొలిసారిగా మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను తో యువ నటుడు రామ్ పోతినేని వర్క్ చేస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద. భారీ మాస్ మూవీగా పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ సంస్థ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు స్కంద నుండి రిలీజ్ అయిన గ్లింప్స్ తో పాటు రెండు సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు పెంచేసాయి.

అయితే మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని ఆగష్టు 26న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ట్రైలర్ రిలీజ్ అనంతరం స్కంద పై హైప్ భారీగా పెరగడంతో పాటు రిలీజ్ తరువాత మూవీ కూడా అందరి అంచనాలు అందుకుని పెద్ద సక్సెస్ కొడుతుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి సెప్టెంబర్ 15న పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

తాజా వార్తలు