టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ శ్రీలీల అలాగే మీనాక్షి చౌదరి లు హీరోయిన్స్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్టైనర్ చిత్రం “గుంటూరు కారం” కోసం అందరికీ తెలిసిందే. మరి భారీ అంచనాలతో ఉన్న ఈ చిత్రం కోసం మహేష్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే మొన్న మహేష్ బర్త్ డే కానుకగా సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ కావాల్సి ఉంది కాని పలు కారణాల చేత అది రాలేదు. దీనితో ఈ సినిమా మొదటి సాంగ్ పట్ల మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఎట్టకేలకు ఈ సాంగ్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సాంగ్ ని మేకర్స్ ఈ వినాయక చతుర్థి కానుకగా అయితే రిలీజ్ చేయాలని చూస్తున్నారటం మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు హారిక హాసిని వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


