
లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా కాజల్ అగర్వాల్ రకుల్ ప్రీత్ సింగ్ లాంటి స్టార్ హీరోయిన్స్ సహా ఎస్ జె సూర్య, సిద్ధార్థ్ లాంటి స్టార్ తారాగణంతో దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “ఇండియన్ 2” కోసం అందరికీ తెలిసిందే. మరి శంకర్ నెక్స్ట్ లెవెల్ హంగులుతో ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా ఈ అవైటెడ్ ప్రాజెక్ట్ రిలీజ్ కోసం అంతా ఆసక్తి గా అయితే ఎదురు చూస్తున్నారు.
మరి ఇప్పటికే చాలా న్యూస్ లు వైరల్ అయ్యాయి కానీ లేటెస్ట్ గా కోలీవుడ్ వర్గాలు స్ట్రాంగ్ గా ఓ టైం ని చెప్తున్నాయి. దీనితో ఈ సినిమా వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ డే టార్గెట్ గా థియేటర్లులో దిగబోతుంది అని అంటున్నారు. అలానే దీనిపై ఓ అధికారిక అప్డేట్ కూడా త్వరలో రాబోతుంది అని అంటున్నారు. మరి ఈ అవైటెడ్ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే లైకా ప్రొడక్షన్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

