టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గుంటూరు కారం. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ పై సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి.
అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఈ మూవీ యొక్క మ్యూజికల్ వర్క్ జరుగుతోందని తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి దిగిన పిక్ ని సంగీత దర్శకుడు థమన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి మూడు సాంగ్స్ రికార్డింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ ని రానున్న వినాయకచవితి కానుకగా రిలీజ్ చేసే అవకాశము ఉందని అంటున్నాయి సినీ వర్గాలు. అయితే దీని పై గుంటూరు కారం మేకర్స్ నుండి అఫీషియల్ ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. కాగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు ముగించి గ్రాండ్ గా 2024 జనవరి 12న విడుదల చేయనున్నారు.


