
యంగ్ అండ్ డెడికేటెడ్ హీరో నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా ‘అమృతం’ నటుడు ప్రముఖ రచయిత కూడా అయినటువంటి హర్ష వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే “మామా మశ్చీంద్ర”. మరి ఈ చిత్రంలో సుధీర్ బాబు ప్రయోగాత్మకంగా మూడు భిన్నమైన పాత్రలను చేయగా మేకర్స్ అయితే ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ని ఇప్పుడు విడుదల చేశారు.
అయితే ఈ సాంగ్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఒక సోల్ లో అందరి హృదయాలని హత్తుకునేలా ఉందని చెప్పాలి. అమ్మ పై వచ్చే పాటలు అన్నీ బాగుంటాయి. అదే విధంగా ఈ పాట కూడా చాలా బాగుంది అని చెప్పాలి. శ్రీనివాసన్ గాత్రం ఈ పాటకి కానీ సాహిత్యానికి కానీ పర్ఫెక్ట్ గా సెట్ కాగా సాంగ్ చూపించిన ప్లెజెంట్ విజువల్స్ కూడా బావున్నాయి. అలాగే చైతన్ భరద్వాజ్ నుంచి మరో బ్యూటిఫుల్ నెంబర్ వచ్చింది అని చెప్పొచ్చు. మరి ఈ చిత్రంలో మిర్నాలిని రవి ఈషా రెబ్బ లు నటించగా ఈ అక్టోబర్ 6న సినిమా రిలీజ్ కాబోతుంది.
సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

