రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా నటించిన చంద్రముఖి 2 సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో కీరవాణి మాట్లాడుతూ .. ‘చంద్రముఖి 2’ సినిమాలో దెయ్యాన్ని చూపించకుండానే వాసుగారు భయపెట్టేశారు. పైగా ‘చంద్రముఖి’ సినిమాకి గురుకిరణ్ – విద్యాసాగర్ గారు సంగీతం పరంగా ఒక మార్కును సెట్ చేశారు. ఆ మార్కును తట్టుకుని నేను పనిచేయడం కష్టమైందనే చెప్పాలి. అయినా నా వంతు ప్రయత్నం చేశాను. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందనే ఆశిస్తున్నాను” అంటూ కీరవాణి చెప్పడం విశేషం.
అలాగే కీరవాణి ఇంకా మాట్లాడుతూ.. లైకా సంస్థ.. లారెన్స్ .. కంగనాలతో కలిసి పనిచేయడం ఇదే ఫస్టు టైమ్. వాళ్లు చాలా గొప్పగా చేశారు. వాళ్ల కెరియర్లో ఇది చెప్పుకోదగిన సినిమా అవుతుందని నేను నమ్ముతున్నాను అని కీరవాణి కామెంట్స్ చేశారు. అన్నట్టు ఈ వేదికపై మహిమ నంబియార్ పాట పాడటం .. కంగనా స్టెప్పులు వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు.


