
రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటించిన స్కంద చిత్రం సెప్టెంబర్ 28, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ ట్రైలర్ కూడా సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. అయితే రామ్ పోతినేని సినిమా ప్రమోషన్స్ ను షురూ చేశారు. లేటెస్ట్ ట్రెండీ లుక్ లో ఉన్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ మరొక లేడీ లీడ్ లో నటిస్తుంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ పోతినేని తదుపరి, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ లో కనిపించనున్నారు.

