‘లియో’ నుండి ‘బ్యాడ్ యాస్’ తెలుగు సాంగ్ రిలీజ్ టైం ఫిక్స్

‘లియో’ నుండి ‘బ్యాడ్ యాస్’ తెలుగు సాంగ్ రిలీజ్ టైం ఫిక్స్

Published on Oct 7, 2023 1:00 AM IST

Badaas

ఇలయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ లియో. త్రిష హీరోయిన్ గా గ్రాండ్ లెవెల్లో రూపొందుతున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా కీలక పాత్రల్లో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్, అర్జున్ సర్జా నటిస్తున్నారు. మరోపైపు నిన్న లియో నుండి రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మరింతగా అంచనాలు ఏర్పరిచింది.

ఇక ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన బ్యాడ్ యాస్ అనే పల్లవితో సాగే సాంగ్ ట్రెండీ స్టైల్ లో అందరినీ ఆకట్టుకుంది. విషయం ఏమిటంటే ఆ సాంగ్ యొక్క తెలుగు వర్షన్ ని రేపు ఉదయం 10 గం. 30 ని. లకు రిలీజ్ చేయనున్నట్టు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఇక లియో మూవీ అన్ని కార్యక్రమాలని ముగించుకుని అక్టోబర్ 19న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు