యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ ఆనంద్ దేవరకొండ అలాగే విరాజ్ లు హీరోలుగా యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “బేబి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం థియేటర్స్ తర్వాత ఓటిటిలో అలాగే ఆ తర్వాత బుల్లితెరపై మాసివ్ రెస్పాన్స్ తో అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
అయితే ఇలాంటి చిత్రాన్ని అందించిన దర్శకుడు సాయి రాజేష్ కి అయితే లేటెస్ట్ గా ఓ అవార్డు దక్కింది. రీసెంట్ గా జరిగిన ఇనోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అయితే ట్రెండింగ్ ఐకానిక్ దర్శకునిగా సాయి రాజేష్ అవార్డు దక్కించుకున్నాడు. దీనితో బేబి అవార్డ్స్ హంట్ స్టార్ట్ అయ్యింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ బ్యూటిఫుల్ చార్ట్ బస్టర్ ఆల్బమ్ ని అందించగా ఎస్ కే ఎన్ నిర్మాణం వహించారు.


