
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. మాస్ యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఇటీవల నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో భాగంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు వివరణ ఇచ్చారు నాగవంశీ. గుంటూరు కారం మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కోనసీమ ప్రాంతంలో చేయండి అలానే ఈ ఈవెంట్ కి మరొక సూపర్ స్టార్ ఎవరైనా గెస్ట్ గా రానున్నారా అంటూ కొందరు ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలని యాంకర్ ప్రస్తావించారు.
అయితే ప్రస్తుతం టీమ్ మొత్తం కూడా వేగంగా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉందని, అలానే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని డిఫరెంట్ గా ప్లాన్ చేసేలా ఆలోచన చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే దానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు వాటి గురించి క్లియర్ గా చెప్పలేనని, కొన్నాళ్ల తరువాత పక్కాగా టీమ్ నుండి అన్ని వివరాలు బయటకు వస్తాయని తెలిపారు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ రిలీజ్ తరువాత ఎంతమేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

