టాక్ : ప్రభాస్ బర్త్ డే కి ‘సలార్’ నుండి నో టీజర్ ?

టాక్ : ప్రభాస్ బర్త్ డే కి ‘సలార్’ నుండి నో టీజర్ ?

Published on Oct 17, 2023 1:02 AM IST

Salaar 2

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరెక్కుతున్న లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ సలార్ సీస్ ఫైర్ పార్ట్ 1. ఈ మూవీని హోంబలె ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తుండగా కీలక పాత్రల్లో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, రామచంద్రరాజు, ఈశ్వరరావు, శ్రియా రెడ్డి నటిస్తున్నారు. డిసెంబర్ 22న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది ఈ మూవీ.

అయితే రానున్న అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుండి ఒక స్పెషల్ టీజర్ వచ్చే ఛాన్స్ ఉందని ఇటీవల మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల బజ్ ప్రకారం ఆ రోజున సలార్ మేకర్స్ నుండి ఒక ప్రత్యేక పోస్టర్ మాత్రమే వస్తుందట. అలానే ప్రభాస్ నటిస్తున్న మరొక మూవీ కల్కి 2898 ఏడి నుండి కూడా ప్రత్యేక పోస్టర్ రానుండగా మారుతీతో ప్రభాస్ చేస్తున్న కమర్షియల్ ఎంటర్టైనర్ నుండి మాత్రం ఎటువంటి అప్ వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. అయితే దీని పై ఆయన మూవీస్ యొక్క మేకర్స్ నుండి క్లారిటీ మాత్రం రావాల్సి ఉంది.

తాజా వార్తలు