ప్రస్తుతం సౌత్ ఇండియా మ్యూజిక్ లవర్స్ సహా మూవీ లవర్స్ లో గట్టిగా వినిపిస్తున్న సినిమా పేరు “లియో”. దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరియు హీరో విజయ్ కాంబినేషన్ లో వీరితో పాటుగా తమ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో వచ్చిన ఈ చిత్రం ఉన్న హైప్ ని ఆల్ మోస్ట్ అందుకుంది. అయితే అంతా ఎక్కువగా ఎగ్జైట్ అయ్యిన పాయింట్ ఏదన్నా ఈ సినిమాకి ఉంది అంటే అది లోకి సినిమాటిక్ యూనివర్స్ కోసమే అని చెప్పడంలో సందేహం లేదు.
మరి లాస్ట్ టైం విక్రమ్ సినిమాకే అనిరుద్ మాస్ డ్యూటీ చేసి క్రేజీ ట్యూన్స్ ని ఖైదీ, విక్రమ్ రోలెక్స్ థీమ్ లతో కలిపి అందించగా మూవీ లవర్స్ లో హైప్ ఎక్కడికో వెళ్ళింది. మరి ఇప్పుడు లియో సినిమా చూసిన వాళ్ళకి అయితే లోకి యూనివర్స్ 2.0 పరిచయం చేస్తూ కొట్టిన ట్యూన్ కానీ సినిమాలో మరికొన్ని సర్ప్రైజ్ ట్రాక్స్ తో డైరెక్ట్ గా థియేటర్స్ లోనే ఊహించని ట్రీట్ ని అందించారు.
ఇక ఈ క్రేజీ ట్యూన్స్ ని చాలా లేట్ గా వదలొచ్చు అని అంతా అనుకున్నారు కానీ అనిరుద్ వాటిని మాత్రం ముందే వదిలేసాడు. ప్రముఖ మ్యూజిక్ ప్లాట్ ఫామ్స్ అన్నింట్లో వదిలేసాడు. దీనితో ఇక ఈ ట్యూన్స్ ఇప్పుడు అందరి ప్లే లిస్ట్ ని రూల్ చెయ్యడం స్టార్ట్ చేసాయి.
Here is the full #LEO album ????https://t.co/SqX9CccypN
More tracks to keep coming in forthcoming days@actorvijay @Dir_Lokesh @trishtrashers @akarjunofficial @duttsanjay @7screenstudio @Jagadishbliss @SonyMusicSouth pic.twitter.com/zi7f8x8GA8
— Anirudh Ravichander (@anirudhofficial) October 19, 2023


