పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్. అనౌన్స్ మెంట్ నుండి అందరిలో భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచిన సలార్ లో మోస్ట్ వయొలెంట్ మ్యాన్ పాత్రలో కనిపించనున్నారు ప్రభాస్. ఇప్పటికే సలార్ నుండి రిలీజ్ అయిన టీజర్ అందరినీ ఆకట్టుకుని క్రేజ్ మరింతగా పెంచగా నేడు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా టీమ్ స్పషల్ బర్త్ డే విషెస్ పోస్టర్ ని రిలీజ్ చేసింది.
అయితే సినిమా రిలీజ్ కి టైం దగ్గరపడుతుండడంతో నేడు సలార్ నుండి ట్రైలర్ లేదా సాంగ్ అనౌన్స్ మెంట్ ఉంటుందని భావించిన ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశ ఎదురైంది. దానితో పలువురు ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో మేకర్స్ పై కామెంట్స్ చేస్తున్నారు. హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై అత్యంత భారీ స్థాయిలో నిర్మితం అవుతున్న ఈమూవీ డిసెంబర్ 22న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.


