
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గుంటూరు కారం.
ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రారంభం నాటి నుండి అందరిలో భారీ స్థాయి అంచనాలు కలిగిన గుంటూరు కారం మూవీలోని సెకండ్ హాఫ్ లో మహేష్ బాబు ఒక మిడిల్ ఏజ్ గెటప్ లో కొన్ని నిమిషాల పాటు కనిపించనున్నారని, అది ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది అంటూ నిన్నటి నుండి ఒక న్యూస్ పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అయింది.
అయితే అది కేవలం గాసిప్ మాత్రమే అని, ఈ మూవీలో మహేష్ బాబు యంగ్ అండ్ డైనమిక్ మాస్ రోల్ లో మాత్రమే కనిపిస్తారని దీనిపై టీమ్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ అతి త్వరలో రానుండగా మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2024 జనవరి 12న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

