యువ నటుడు సందీప్ కిషన్ హీరోగా వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ ఊరు పేరు భైరవకోన. ఈ మూవీని అనిల్ సుంకర సమర్పిస్తుండగా హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకోగా తాజాగా హుమ్మ హుమ్మ అనే పల్లవితో సాగే సెకండ్ సాంగ్ లిరికల్ వీడియోని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసారు మేకర్స్.
రామ్ మిరియాల అద్బుతంగా పాడిన ఈ సాంగ్ ని శేఖర్ చంద్ర, తిరుపతి జావన రచించారు. మెలోడియస్ గా యువతని ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో కొనసాగుతోంది. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం గ్రాఫిక్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతోంది. కాగా అతి త్వరలో ఊరు పేరు భైరవకోన మూవీ యొక్క రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


