మాస్ మహారాజా రవితేజ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ నుపుర్ సనన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ దర్శకుడు వంశీ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రమే “టైగర్ నాగేశ్వరరావు”. మరి మంచి అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం రవితేజ కెరీర్ లో మరో 50 కోట్ల గ్రాసర్ గా నిలిచి ఇప్పటికీ మంచి రన్ తో అయితే దూసుకెళ్తుంది.
ఇక దసరా కానుకగా స్టార్ట్ అయ్యి రెండో వీకెండ్ కి వచ్చిన ఈ చిత్రం బుక్ మై షో లో అయితే గడిచిన 24 గంటల్లో మంచి బుకింగ్స్ తో కొనసాగుతుంది. లాస్ట్ 24 గంటల్లో ఈ చిత్రానికి 20 వేలకి పైగా టికెట్స్ ఆన్ లైన్ యాప్ బుక్ మై షో లో బుక్ అయ్యాయి. దీనితో టైగర్ నాగేశ్వరరావు వీకెండ్ హోల్డ్ బాగానే ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రం మరో హీరోయిన్ గా గాయత్రీ భరద్వాజ్ నటించగా జివి ప్రకాష్ సంగీతం అందించాడు. అలాగే అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహించారు.


