కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ లియో థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది ఈ సినిమా. ఈ చిత్రం కి సంబందించిన సక్సెస్ మీట్ నేడు నెహ్రూ ఇండోర్ స్టేడియం లో జరగనుంది. ఇప్పటికే మేకర్స్ దీనిపై అధికారిక ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో ప్రతి ఒక్కరూ కూడా విజయ్ స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.
లియో సినిమా రిలీజైన టైమ్ లో చాలా విమర్శలు వచ్చాయి. వీటిపై హీరో విజయ్ ఎలా రెస్పాండ్ అవుతారు అనే దాని కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష కృష్ణన్, సంజయ్ దత్, అర్జున్ సర్జా, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్ లు కీలక పాత్రల్లో నటించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు.


