
మాస్ మహారాజా రవితేజ ఇటీవల యువ దర్శకుడు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ టైగర్ నాగేశ్వరరావు ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్నారు.
అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీలో నవదీప్, మధుబాల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రానుంది. విషయం ఏమిటంటే, ఈగిల్ మూవీ యొక్క టీజర్ అనౌన్స్ మెంట్ ని రేపు అందించనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ఒక పోస్టర్ ద్వారా తెలిపారు. ఇక టీజర్ రిలీజ్ అనంతరం మూవీ నుండి ఒక్కొక్కటిగా అప్ డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీతో మాస్ మహారాజా ఎంతమేర సక్సెస్ సొంతం చేసుకుంటారో చూడాలి.

