మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా తన హిట్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రం “హను మాన్” కోసం అందరికీ తెలిసిందే. మరి టీజర్ తో అయితే ఓ రేంజ్ లో హైప్ అందుకున్న ఈ చిత్రం కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ అయితే ఎప్పటి నుంచో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మెయిన్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ టేకింగ్ గాని సినిమాలో విజువల్స్ ఆడియెన్స్ ని బాగా ఇంప్రెస్ చేయడంతో పాటుగా టాలీవుడ్ ఆడియెన్స్ మాత్రం చాలా ఎగ్జైటెడ్ గా ఈ సినిమా పట్ల ఉన్నారు. ఇక ఈ సినిమా నుంచి అయితే థియేట్రికల్ ట్రైలర్ కోసం కూడా చాలా ఆసక్తిగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తుండగా దీనిపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది. దీనితో ఈ అవైటెడ్ ట్రైలర్ అయితే ఈ డిసెంబర్ 1న విడుదల చేయనున్నట్టుగా సన్నాహాలు చేసున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.


