గ్లోబల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ యాక్షన్ ప్రాజెక్ట్ “దేవర”. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం పట్ల తారక్ ఫ్యాన్స్ యమ ఎగ్జైటింగ్ గా ఉండగా ఈ సినిమా షూటింగ్ ని దర్శకుడు కొరటాల శివ అండ్ టీం అయితే జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తున్నారు. ఇక ఈ భారీ చిత్రం రీసెంట్ గానే కొన్ని ఆసక్తికర సన్నివేశాలని గోవా షెడ్యూల్ లో కంప్లీట్ చేసుకోగా ఇక నెక్స్ట్ షూట్ పై ఇప్పుడు అప్డేట్ తెలుస్తుంది.
దీనితో హైదరాబాద్ లోనే షూట్ స్టార్ట్ చేయనున్నారని తెలుస్తుంది. అక్కడ వేసిన ప్రత్యేక సెట్టింగ్ లలో ఈ షూటింగ్ ని స్టార్ట్ చేయనుండగా కొన్ని విలేజ్ సంబంధిత సీక్వెన్స్ లని తెరకెక్కించనున్నారట. కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


