జరగండి..ఇక రామ్ చరణ్ వంతు మిగులు..!

జరగండి..ఇక రామ్ చరణ్ వంతు మిగులు..!

Published on Nov 10, 2023 6:59 AM IST

game

గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న గ్రాండ్ చిత్రం “గేమ్ చేంజర్”. మరి మళ్ళీ శంకర్ నుంచి తన మార్క్ సాలిడ్ పొలిటికల్ థ్రిల్లర్ ని అంతా ఆశిస్తుండగా ఈ సినిమా షూటింగ్ అయితే ఇప్పుడు దశల వారీగా కంప్లీట్ అవుతుంది. ఇక ఇదిలా ఉండగా ఈ భారీ చిత్రం నుంచి అయితే అవైటెడ్ గా ఉన్న ఫస్ట్ సింగిల్ ‘జరగండి’ ని మెగా ఫ్యాన్స్ అయితే విట్నెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

మరి ఇప్పటికే మన టాలీవుడ్ నుంచి ఈ దీపావళి కానుకగా గుంటూరు కారం నుంచి సూపర్ స్టార్ దం మసాలా అమితంగా ఆకట్టుకోగా ఇక నెక్స్ట్ బిగ్ ట్రీట్ గా రామ్ చరణ్ వంతే మిగిలింది అని చెప్పాలి. మరి ఈ సాంగ్ అయితే దీపావళి కానుకగా ఓ రోజు ముందు కానీ దీపావళి రోజున కానీ లాంచ్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆల్రెడీ సాంగ్ హిట్ అని అందరికీ తెలుసు. కానీ శంకర్ గ్రాండ్ విజువల్స్ లో రామ్ చరణ్ ప్రెజెన్స్ తో అయితే సాంగ్ ఎలా ఉంటుందో చూడాలని ఆడియెన్స్ తహతహలాడుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు