మరో 100 థియేటర్ల లో “లియో” రీ రిలీజ్!

మరో 100 థియేటర్ల లో “లియో” రీ రిలీజ్!

Published on Nov 17, 2023 10:12 AM IST

LEO1

అక్టోబర్ 19 న దసరా పండుగ సందర్భంగా విడుదలైన చిత్రం లియో. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 600 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్‌ను అధిగమించి 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది.

ఇప్పుడు, తమిళ ఫిల్మ్ సర్కిల్స్ నుండి వస్తున్న తాజా అప్డేట్‌ల ప్రకారం, లియో తమిళనాడు అంతటా 100కి పైగా స్క్రీన్‌లలో రీ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. రీ రిలీజ్ ప్లాన్ వెనుక కారణం టిక్కెట్ కౌంటర్లలో మంచి వసూళ్లను సాధించగల మంచి సినిమాలు ఏమీ లేకపోవడం. 5వ వారంలో కూడా లియో బాక్సాఫీస్ వద్ద మంచి రన్‌ను కొనసాగిస్తోంది. త్రిష, సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో నటించిన లియోను ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

తాజా వార్తలు