క్రేజీ టాక్ : సూపర్ స్టార్ కోసం పవర్ స్టార్ ఫిక్స్ ?

క్రేజీ టాక్ : సూపర్ స్టార్ కోసం పవర్ స్టార్ ఫిక్స్ ?

Published on Nov 18, 2023 7:01 AM IST

mahesh pk

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ తో చేస్తున్న గుంటూరు కారం పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుండగా నెగటివ్ పాత్రలో జగపతి బాబు కనిపించనున్నారు.

కాగా మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీకి పవర్ స్టార్ పవన్ కళ్యణ్ వాయిస్ ఓవర్ అందించనున్నారు అనే వార్త కొన్నాళ్లుగా ప్రచారంలో ఉంది. ఇక తాజా టాలీవుడ్ క్రేజీ టాక్ ప్రకారం నిజంగానే సూపర్ స్టార్ కోసం పవర్ స్టార్ తన వాయిస్ ని అందించారని, మహేష్ బాబు ఎంట్రీ సీన్ తో పాటు పలు కీలక సీన్స్ కి పవర్ స్టార్ అందించిన వాయిస్ ఓవర్ అదిరిపోనుందని అంటున్నారు. అయితే దీని పై గుంటూరు కారం మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా గుంటూరు కారం మూవీని గ్రాండ్ లెవెల్లో జనవరి 12న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

తాజా వార్తలు