టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మరో సినిమా ‘ఈగిల్’ తో ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. భారీ అంచనాల ప్రాజెక్ట్ గా ఈగిల్ కి ఇప్పటికే ఫుల్ క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లోని యాక్షన్ విజువల్స్ వండర్ ఫుల్ గా ఉంటాయట. ముఖ్యంగా రవితేజ గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందట.
ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మధుబాల, నవదీప్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈగల్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రానికి దావ్‌జాంద్ సంగీత దర్శకుడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని ఆకర్షణీయమైన అప్‌డేట్‌ల కోసం మా సైట్ చూస్తూనే ఉండండి.


