సూర్య మరో వినూత్న సినిమా రీ రిలీజ్ ప్లానింగ్.!

సూర్య మరో వినూత్న సినిమా రీ రిలీజ్ ప్లానింగ్.!

Published on Nov 22, 2023 12:00 PM IST

Suriya

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు శివ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న క్రేజీ చిత్రం “కంగువ” కోసం తెలిసిందే. మరి ఈ సినిమా షూట్ లో బిజీగా ఉన్న సూర్య నుంచి గత కొన్నాళ్ల కితమే తన క్లాసిక్ హిట్ చిత్రం “సూర్య సన్నాఫ్ కృష్ణన్” రీ రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయ్యింది. అయితే సూర్య నటించిన ఎన్నో వినూత్న చిత్రాల్లో ఒకటైన “వీడొక్కడే” చిత్రం కూడా ఇప్పుడు రీ రిలీజ్ కి రాబోతున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

మరి ఈ సినిమాకి కే వి ఆనంద్ దర్శకత్వం వహించగా తమిళ్ సహా తెలుగులో కూడా ఈ సినిమాలో భారీ హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు మళ్ళీ సినిమా రిలీజ్ రానుంది. అయితే ఈ సినిమాని వచ్చే ఏడాదిలో ప్లాన్ చేస్తున్నారట. మరి డేట్ ఇతర వివరాలు ఇంకా రావాల్సి ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా హారిస్ జై రాజ్ సెన్సేషనల్ ఆల్బమ్ ని అందించాడు.

తాజా వార్తలు