లేటెస్ట్..”చైతు 23″ పై వచ్చేసిన సాలిడ్ సర్ప్రైజ్.!

లేటెస్ట్..”చైతు 23″ పై వచ్చేసిన సాలిడ్ సర్ప్రైజ్.!

Published on Nov 22, 2023 2:39 PM IST

thadel

మన టాలీవుడ్ ల ఉన్నటువంటి కొందరు యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరోస్ లో అక్కినేని యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య కూడా ఒకడని చెప్పాలి. మరి చైతు హీరోగా తన కెరీర్ లో 23వ చిత్రాన్ని దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం చై కెరీర్ లోనే భారీ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేయగా ఈరోజు నవంబర్ 23 చై బర్త్ డే కానుకగా మేకర్స్ తన 23 వ సినిమా పై బిగ్ అప్డేట్ ని అయితే రివీల్ చేశారు.

మేకర్స్ ఈ చిత్రానికి “తండేల్” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఫిక్స్ చేయగా మేకర్స్ చైతు పై సాలీడ్ ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేశారు. ఇందులో నాగ చైతన్య స్టన్నింగ్ ఫిజిక్ తో అయితే అదరగొట్టాడు అని చెప్పాలి. దీనితో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నట్టు కన్ఫర్మ్ కాగా గీతా ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు