సెన్సార్ కంప్లీట్ చేసుకున్న నయనతార ‘అన్నపూరణి’

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న నయనతార ‘అన్నపూరణి’

Published on Nov 30, 2023 10:35 PM IST

annapoorni
కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల షారుఖ్ ఖాన్ తో కలిసి నటించిన జవాన్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ అన్నపూరణి. కొత్త దర్శకుడు నీలేష్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈమూవీ న‌య‌న్ కెరీర్‌లో 75వ మూవీగా రూపొందుతుండగా దీనిని ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో, నాస్ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్, జీ స్టూడియోస్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాయి.

ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా డిసెంబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన గ్లింప్స్, సాంగ్స్, ట్రైల‌ర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇక తాజాగా ఈ మూవీ యొక్క సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి. కాగా దీనికి సెన్సార్ వారు క్లీన్ యు సర్టిఫికెట్ అందించారు. అలానే ఈ మూవీ యొక్క రన్ టైం 2 గం. 26 ని. లుగా ఉంది. జై, సత్యరాజ్, కెఎస్ రవి కుమార్, రెడిన్ కింగ్స్లీ తదితరులు ఇందులో కీలక పాత్రలు చేసారు. మరి ఈ మూవీ ఎంతమేర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు