ఫుల్ స్వింగ్ లో ‘పెద్ది’ పోస్ట్ ప్రొడక్షన్.. బ్యాక్గ్రౌండ్ లో చరణ్ పవర్ఫుల్ లుక్!

ఫుల్ స్వింగ్ లో ‘పెద్ది’ పోస్ట్ ప్రొడక్షన్.. బ్యాక్గ్రౌండ్ లో చరణ్ పవర్ఫుల్ లుక్!

Published on Mar 14, 2026 7:28 PM IST

Peddi 6

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రమే “పెద్ది”. మంచి బజ్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. అయితే ఈ సినిమాపై లేటెస్ట్ గా మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ ని అందించారు. దీనితో పెద్ది సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా పూర్తవుతున్నట్టు తాము ఖరారు చేశారు.

దర్శకుడు బుచ్చిబాబు సానా ఎడిటింగ్ రూమ్ లో కూర్చొని వర్క్ కొనసాగిస్తున్న పిక్ షేర్ చేసుకున్నారు. ఇక ఇందులోనే బ్యాక్గ్రౌండ్ లో డెస్క్ టాప్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇంటెన్స్ లుక్ కనిపిస్తుంది. దీనితో ఈ పవర్ఫుల్ కళ్ళని చూసిన అభిమానులు పెద్ది పై మరిన్ని అంచనాలు పెట్టుకుంటున్నారు. ఇలా మొత్తానికి మాత్రం ప్యాకెడ్ గా ఈ సినిమా కొనసాగుతుంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే అనుకున్న సమయానికే ఈ సినిమాని తీసుకు వచ్చే విధంగా ప్రణాళికలు వేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు