మెగా కుటుంబంలో రీసెంట్ గానే యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి కార్యక్రమంతో శుభకార్యం జరిగిన సంగతి తెలిసిందే. యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ లు తమ పెద్దలని ఒప్పించి పెళ్లితో ఒకటయ్యారు. దీనితో మెగా ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేయగా ఈ తర్వాత అయితే తమ హ్యాపీ టైం ని ఈ యంగ్ కపుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
అలా లేటెస్ట్ గా వరుణ్ తేజ్ తాను తన బెస్ట్ హాఫ్ లావణ్యతో కలిసి ఓ వెకేషన్ కి వెళ్తున్నట్టుగా తమ ఇద్దరి బ్యూటిఫుల్ సెల్ఫీని అయితే షేర్ చేసి ఆనందం వ్యక్తం చేసాడు. మరి ఈ ఇద్దరూ అయితే తమ డ్రీం ప్లేస్ అయినటువంటి యూరోప్ కి వారు పయనమయ్యారు. దీనితో తమ హ్యాపీ మూమెంట్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. ఇక వరుణ్ తేజ్ నటించిన చిత్రం “ఆపరేషన్ వాలెంటైన్” ఆల్రెడీ రిలీజ్ కి సిద్ధంగా ఉండగా ఈ చిత్రం తర్వాత తాను “మట్కా” అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు.


