నేచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హాయ్ నాన్న. తండ్రీ కూతుళ్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ మూవీ డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా హాయ్ నాన్న సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ పై ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో నాని – శృతి హాసన్ ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా వీరి లవ్ స్టోరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని.. అలాగే ఈ ప్రేమ కథ ముగింపు కూడా చాలా విషాదకరంగా ఉంటుందని తెలుస్తోంది. మెయిన్ గా శృతి హాసన్ పాత్ర చాలా ఎమోషనల్ గా సాగుతుందట.
ఇక ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ఓ ముఖ్య పాత్రలో అయితే శృతి హాసన్ నటించింది. అలాగే హీషం అబ్దుల్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. మరి ఈ డిసెంబర్ 7న పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఇప్పడున్న బజ్ ప్రకారం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి సాలిడ్ కలెక్షన్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు.


