
బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం లో తెరకెక్కిన డంకీ చిత్రం డిసెంబర్ 21, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ ఏడాది పఠాన్ మరియు జవాన్ చిత్రాలతో బాలీవుడ్ కి రెండు బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్ లని అందించాడు షారుఖ్ ఖాన్.
అయితే తాజాగా డంకీ ట్రైలర్ ను రిలీజ్ చేయగా, ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. డైరెక్టర్ హరీష్ శంకర్, షారుఖ్ ఖాన్ పోస్ట్ పై కామెంట్స్ చేసారు. 2023 షారుఖ్ ఖాన్ బెస్ట్ ఇయర్ అని పేర్కొన్నారు. ఇప్పుడు డంకీ వచ్చింది. SRK లవ్ యూ, మీరు ఇన్స్పిరేషన్ మాత్రమే కాదు, ఒక ఎమోషన్ కూడా అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
No doubt 2023 is the Best year of KING KHAN… and here comes DUNKI….. its all over
SRK …. ???????????????? love you @iamsrk ur not just Inspiration… ur an Emotion https://t.co/5KeR15jeii— Harish Shankar .S (@harish2you) December 5, 2023

