అడివి శేష్ – శృతి హాసన్ పాన్ ఇండియా మూవీ డీటైల్స్ ఇవే!

అడివి శేష్ – శృతి హాసన్ పాన్ ఇండియా మూవీ డీటైల్స్ ఇవే!

Published on Dec 12, 2023 1:32 PM IST

Adivi Sesh Shruti Haasan

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్, డైరెక్టర్ అయిన అడివి శేష్ ప్రస్తుతం G2 (గూఢచారి 2) చిత్రం తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం కి సంబందించిన షూటింగ్ నిన్న నే స్టార్ట్ అయ్యింది. గూఢచారి చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే నేడు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

హీరో అడివి శేష్ మరియు స్టార్ హీరోయిన్ అయిన శృతి హాసన్ లు ఇద్దరూ కూడా ఒక భారీ పాన్ ఇండియా మూవీ కోసం కలిసి వర్క్ చేయనున్నారు. శనేయిల్ డియో ఈ చిత్రం తో దర్శకుడు గా పరిచయం అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రానికి నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సునీల్ నారంగ్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. మేజర్ చిత్రం తర్వాత హీరో అడివి శేష్ మరోసారి హిందీ ఆడియెన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

తాజా వార్తలు