కాస్త ఆలస్యంగా సలార్ రిలీజ్ ట్రైలర్!

కాస్త ఆలస్యంగా సలార్ రిలీజ్ ట్రైలర్!

Published on Dec 18, 2023 10:50 AM IST

Salaar 14

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన సలార్ మూవీ వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 22 న థియేటర్ల లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం కి సంబందించిన ప్రచార చిత్రాలు రిలీజై ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం నుండి రిలీజ్ ట్రైలర్ ను ఫైనల్ పంచ్ పేరిట నేడు ఉదయం 10:42 గంటలకు రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు అది ఆలస్యం అయినట్లు తెలుస్తోంది.

మేకర్స్ ట్రైలర్ ను నేడు మధ్యాహ్నం 2:00 గంటలకి రిలీజ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని మరొక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ మాసివ్ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, పృధ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

తాజా వార్తలు