“గుంటూరు కారం”తో క్లాష్ పై “హను మాన్” డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

“గుంటూరు కారం”తో క్లాష్ పై “హను మాన్” డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Dec 19, 2023 3:30 PM IST

GunturKaaram HanuMan

మన తెలుగు ప్రేక్షకుల్లో అలాగే టాలీవుడ్ సినిమా దగ్గర కానీ బిగ్గెస్ట్ ఫెస్టివల్ అండ్ ఫిలిం ఫెస్టివల్ సీజన్ కానీ ఏదన్నా ఉంది అంటే సంక్రాంతి రేస్ అని చెప్పాలి. మరి ఈ ఏడాది పలు భారీ చిత్రాలు క్రేజీ క్లాష్ లతో అదరగొట్టిన ఈ సంక్రాంతి తర్వాత ఇక నెక్స్ట్ సంక్రాంతి కూడా వచ్చేస్తుంది. మరి ఈసారి కూడా పలు భారీ చిత్రాలు క్లాష్ లో ఉండగా వీటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మాస్ డ్రామా “గుంటూరు కారం” తో పాటుగా యంగ్ హీరో తేజ సజ్జ నటించిన భారీ చిత్రం “హను మాన్” కూడా ఉంది.

మరి ఈ రెండు సినిమాల క్లాష్ పట్ల మొదటి నుంచి కూడా అందరిలో కొంచెం టెన్షన్ ఉంది. అయితే ఈ క్లాష్ పై హను మాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. తాను కూడా మహేష్ బాబు గారి అభిమానినే అనే ఆరోజు నేను ‘గుంటూరు కారం’ సినిమా చూస్తాను అని తెలిపాడు.

అయితే తాము ఆ డేట్ ఖాళీ ఉందని ఆ టైం కి వస్తే సినిమా రీచ్ ఎక్కువ ఉంటుంది అని నాకు తెలిసి ఆ డేట్ ని మేమే ముందు అనౌన్స్ చేశామని అక్కడ నుంచి అన్ని చోట్ల అగ్రిమెంట్స్ కూడా పూర్తి చేసుకోవడంతో ఇక మాకు వేరే డేట్ కి వెళ్ళడానికి లేదని అందుకే అదే డేట్ కి వస్తున్నామని తెలిపాడు. దీనితో ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

తాజా వార్తలు