నాల్గోసారి సలార్ ను చూడనున్న బేబీ ప్రొడ్యూసర్!

నాల్గోసారి సలార్ ను చూడనున్న బేబీ ప్రొడ్యూసర్!

Published on Dec 24, 2023 6:27 PM IST

salaar 4

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన సలార్ మూవీ థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం ను పలువురు సినీ ప్రముఖులు సైతం చూసి ప్రశంసల వర్షం కురిపించారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా ను మరోసారి చూసేందుకు సిద్ధం అవుతున్నారు బేబీ చిత్రం నిర్మాత ఎస్కేఎన్.

ఇప్పటికే మూడు సార్లు సినిమా చూసా అని, ఈరోజు రాత్రి మరోసారి చూడనున్నట్లు తెలిపారు. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, పృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

తాజా వార్తలు