
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్. హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా రవి బస్రూర్ సంగీతం అందించారు. డిసెంబర్ 22న విడుదలై మంచి సక్సెస్ టాక్ సొంతం చేసుకున్న సలార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బాగా కలెక్షన్ తో కొనసాగుతోంది.
ఈశ్వరి రావు, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రియా రెడ్డి వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ మొత్తంగా సక్సెస్ సొంతం చేసుకోవడంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విషయం ఏమిటంటే, ప్రస్తుతం సలార్ మూవీ నేపాల్ లో ప్రదర్శితం అవుతున్న ఒక థియేటర్ లో ప్రభాస్ మాస్ క్రేజ్ చూస్తే మతిపోతుంది. ఎందరో ఫ్యాన్స్ గోలలు, కేరింతలతో సలార్ టికెట్స్ కోసం బారులు తీరడంతో పాటు థియేటర్ లో సందడి చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Nepal #Salaar ???????? pic.twitter.com/H6bHTLE2E9
— Teja (@tejarebel10) December 26, 2023

