దేవర’ మూవీ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ని మించి ఉంటుందని నా అభిప్రాయం – కళ్యాణ్ రామ్

దేవర’ మూవీ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ని మించి ఉంటుందని నా అభిప్రాయం – కళ్యాణ్ రామ్

Published on Dec 27, 2023 8:14 PM IST

kalyan ram
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ దేవర. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ పై అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. తాజా తన డెవిల్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ అధినేత నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, దేవర అనేది ఎంతో గ్రాండ్ స్కేల్ లో హై టెక్నీకల్ వాల్యూస్ తో రూపొందుతోన్న మూవీ అని అన్నారు.

అయితే మీ మూవీ హాలీవుడ్ ప్రాజక్ట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ మాదిరిగా ఉంటుందట కదా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు ఈ విధంగా కళ్యాణ్ రామ్ బదులిచ్చారు. నిజానికి దేవర మూవీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కంటే కూడా మించి ఉంటుందనేది తన వ్యక్తిగత అభిప్రాయం అని అన్నారు. మూవీ కోసం ఎన్నో టీమ్స్ ఎంతో కష్టించి పని చేస్తున్నారని, త్వరలో టీజర్ కి సంబందించిన అప్ డేట్ అందిస్తాం అని తెలిపారు. కాగా దేవర మూవీ ఏప్రిల్ 5 న విడుదల కానున్న విషయం తెలిసిందే.

తాజా వార్తలు