బాలీవుడ్ కి చెందిన ప్రముఖ కాంట్రవర్సియల్ నటి, మోడల్ అయినటువంటి పూనమ్ పాండే నిన్ననే చనిపోయినట్టుగా ఆమె టీం నుంచి వార్త రావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. దీనితో ఆమె నిజంగానే చనిపోయింది అని భావించిన చాలా మంది ఆమె ఆత్మకి శాంతి చేరాలని నివాళులు కూడా అర్పించారు. అయితే ఆమె సర్వైకల్ క్యాన్సర్ కారణంగా తన 32వ ఏట చనిపోయింది అని వార్తలు కన్ఫర్మ్ అవ్వగా ఇప్పుడు అందరికీ తాను బ్రతికే ఉన్నాను అంటూ షాకిచ్చింది.
ఒక వీడియోని రిలీజ్ చేసి తాను చనిపోలేదు బ్రతికే ఉన్నాను అని అయితే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎంత ప్రమాదకరం దీని వల్ల చాలా మంది ఆడవాళ్ళకి అవగాహన లేక జాగ్రత్తగా ఉండడం లేదు అని అందుకే తాను ఇలా చేసి అందరికీ తెలిసేలా చేద్దామని ప్రయత్నం చేసానని, ఈ ప్రక్రియలో ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే క్షమించాలని చెప్పుకొచ్చింది. అయితే ఈ వీడియో రిలీజ్ చేసాక మళ్ళీ నిన్ను ఎవరైనా నమ్ముతారా అంటూ నెటిజన్స్ బాగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


