మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో టిల్లు బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కూడా ఒకడు. మరి ఇప్పుడు టిల్లు స్క్వేర్ తో సిద్ధంగా ఉన్న తాను ఈ చిత్రం తర్వాత ఇంట్రెస్టింగ్ లైనప్ ని తాను సెట్ చేసుకున్నాడు. మరి ఈ చిత్రాల్లో వెర్సటైల్ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో సెట్ చేసిన సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా “జాక్” కూడా ఒకటి. మరి ఈ చిత్రంపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా ఓవర్సీస్ డీల్ అయితే ఇప్పుడు కంప్లీట్ చేసుకుంది.
ఈ సినిమా యూఎస్ మార్కెట్ హక్కుల్ని సలార్, గుంటూరు కారం లాంటి చిత్రాల్ని డిస్ట్రిబ్యూషన్ చేసిన ప్రత్యంగిరా సంస్థ వారు రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. మరి తాము ఈ చిత్రాన్ని ఏఏ క్రియేషన్స్ వారితో కలిసి సంయుక్తంగా విడుదల చేస్తున్నట్టుగా అనౌన్స్ చేస్తూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ చిత్రానికి బివి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణం వహిస్తుండగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుంది.
This time, it's #JACK ????
Thrilled to bring the crazy madness to the North American audience ❤️
See you at the cinemas soon!#SidduJonnalagadda#SVCC37 @iamvaishnavi04@baskifilmz @SVCCofficial @AACreationsUS pic.twitter.com/NedtHQclbt
— Prathyangira Cinemas (@PrathyangiraUS) February 27, 2024


