టాలీవుడ్‌లో మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ‘ది డీల్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డిజిక్వెస్ట్, సిటిడెల్ క్రియేషన్స్ బ్యానర్‌లో డాక్టర్ అనితారవు సమర్పణలో పద్మారమాకాంతరావు, కొల్వి రామకృష్ణ నిర్మాతలుగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాను హను కోట్ల డైరెక్ట్ చేస్తూ నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. హైదరాబాద్‌లోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్‌లో ఈ పోస్టర్‌ని ఆవిష్కరించారు. ఈ కార్యకరమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ కేవి రమణాచారి హాజరై సినిమా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘నటన, దర్శకత్వంపై మంచి అవగాహన ఉన్న హను కోట్ల ‘ది డీల్’ సినిమాతో మన ముందుకు రావడం సంతోషంగా ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుతున్నా..’’ అని అన్నారు.
సినిమా హీరో అండ్ డైరెక్టర్ హను కోట్ల మాట్లాడుతూ..‘‘రంగస్థలం నుండి సినిమా వైపు అడుగులు వేస్తున్నాను. ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఒక డిఫరంట్ స్టోరీతో మీ ముందుకు వస్తున్నాం.’’ అని అన్నారు.
డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్ MD కె.బసిరెడ్డి మాట్లాడుతూ..‘‘ది డీల్ సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. పెద్ద స్టార్స్ లేని సినిమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.’’ అని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో TFPC అధ్యక్షుడు K.L.దామోదర్ ప్రసాద్, ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్, సినీ రచయిత ఆకెళ్ల శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



