తిరుపతిలోని SEAT కాలేజీలో ‘హైడ్ ఎన్ సీక్’ ట్రైలర్ లాంచ్

తిరుపతిలోని SEAT కాలేజీలో ‘హైడ్ ఎన్ సీక్’ ట్రైలర్ లాంచ్

Published on Sep 5, 2024 8:50 AM IST

Hide N Seek

సహస్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిశాంత్, ఎంఎన్ఓపీ సమర్పణలో నరేంద్ర బుచ్చిరెడ్డిగారి ప్రొడ్యూస్ చూస్తున్న సినిమా ‘హైడ్ ఎన్ సీక్’. ఈ చిత్రాన్ని దర్శకుడు బసిరెడ్డి రానా డైరెక్ట్ చేస్తుండగా, ఈ మూవీ ట్రైలర్‌ని తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. తిరుపతిలోని SEAT కాలేజీలో ఈ ట్రైలర్ లాంచ్ ఘనంగా జరిగింది. కాలేజీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చిత్రం కాస్ట్ అండ్ క్రూ, కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి మాట్లాడుతూ.. ఇంత మంచి అవకాశం ఇచ్చిన కాలేజీ యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రం అందరినీ అలరించే ఓ సస్పెన్స్ అవుతుందని.. అందరూ కచ్చితంగా సెప్టెంబర్ 13న థియేటర్లలో ఆదరించాలని అన్నారు.

హీరోయిన్ శిల్పా మంజునాథ్ మాట్లాడుతూ.. ‘హైడ్ ఎన్ సీక్’ చిత్రం విద్యార్థుల నుంచి పెద్దవారి వరకు అందరినీ థ్రిల్‌కు గురిచేస్తుందని, ఖచ్చితంగా థియేటర్లో ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

హీరోయిన్ రియా సచ్దేవ్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 13న ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతుందని, అందరూ కచ్చితంగా చూసి ఆదరించాలని కోరారు. ఈ చిత్రం మీ అందరినీ కచ్చితంగా ఎంటర్‌టైన్ చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇక కాలేజ్ స్టూడెంట్స్, టీచర్స్, హైడ్ ఎన్ సీక్ మూవీ కాస్ట్ అండ్ క్రూ కి స్పెషల్ థాంక్స్ చెప్పారు.

థియేటర్‌లో చూసే ప్రేక్షకులను ఆధ్యంతం కట్టి పడేసే అద్భుతమైన కథతో హైడ్ ఎన్ సీక్ చిత్రం రూపొందిందని.. ప్రతి ఒక్కరినీ ఖచ్చితంగా అలరిస్తుందని, సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే ఎన్నో సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయని డైరెక్టర్ బసిరెడ్డి రానా తెలిపారు. ఈ సందర్భంగా ఇంత మంచి అవకాశం ఇచ్చిన కాలేజీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తాజా వార్తలు