‘డియర్ ఉమ’ అందరికీ అవగాహన కల్పించే చిత్రం – నిర్మాత, హీరోయిన్ సుమయ రెడ్డి

‘డియర్ ఉమ’ అందరికీ అవగాహన కల్పించే చిత్రం – నిర్మాత, హీరోయిన్ సుమయ రెడ్డి

Published on Apr 15, 2025 7:22 AM IST

ah

తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రంతో ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా సుమయ రెడ్డి మీడియాతో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

కరోనా టైంలో తనకు ప్రతీ రోజూ ఓ కల వచ్చేదని.. అది తనను వెంటాడుతూ ఉన్నట్టుగా అనిపించిందని.. అలా ఆ కలలో వచ్చిన పాయింట్ మీదే కథను రాసుకుని ఈ సినిమాను చేసినట్లుగా సుమయ రెడ్డి తెలిపారు. ఈ సినిమాలో కార్పొరేట్ హాస్పిటల్స్‌లో డాక్టర్లు, పేషెంట్స్‌కి మధ్యలో ఉండే పర్సన్స్‌ సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుందనే పాయింట్ చూపిస్తున్నట్లు ఆమె తెలిపారు. డియర్ ఉమ చిత్రం కాస్త ఫిక్షనల్.. కాస్త రియల్. సోషల్ మెసెజ్ అని కాకుండా ఓ సొల్యూషన్‌ని కూడా ఈ సినిమాలో చెబుతున్నట్లు ఆమె తెలిపారు. అందరికీ అవగాహన కల్పించేలా ఈ చిత్రం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

ఈ సినిమాకు రదన్ మ్యూజిక్ అందించగా రాజ్ తోట కెమెరామెన్‌గా చక్కటి విజువల్స్ అందించారు. ఏప్రిల్ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు