బాలయ్య బాబు – గోపీచంద్ మలినేని కలయికలో సతీష్ కిలారు నిర్మిస్తున్న పీరియాడిక్ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రం నవంబర్ 2025 లో ఘనంగా ప్రారంభించబడింది. ఐతే, నిన్న రాత్రి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ అరవింద్ ఎస్ కశ్యప్, షూటింగ్ లొకేషన్ నుండి ఒక చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో కొంత హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ వుంటుందని, బాలకృష్ణ మహరాజుగా కనిపిస్తారు. ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమా పై ఫుల్ ఫోకస్ పెట్టారు. అన్నట్టు ఈ సినిమా గురించి గోపీచంద్ మలినేని ఎక్స్ వేదికగా ఆ మధ్య స్పందిస్తూ.. ‘‘గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్.. ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉండనుంది. బాలకృష్ణతో కలిసి మరోసారి వర్క్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రం కానుంది’’ అని తన పోస్ట్ లో పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ నటించనున్న 111 ప్రాజెక్ట్ ఇది



