పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “హరిహర వీరమల్లు”. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ఫైనల్ గా రిలీజ్ కి వస్తుండగా ఆ రిలీజ్ డేట్ క్లారిటీ కోసం ఇపుడు పవన్ అభిమానులు ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం ఇప్పటికే పలు మార్లు విడుదల ఆగాల్సి వచ్చింది.
ఇలా ఈ మే 9 నుంచి షిఫ్ట్ అయ్యిన ఈ సినిమా కొత్త డేట్ ఏంటి అనే సస్పెన్స్ ఇపుడు నెలకొనగా లేటెస్ట్ గా బుక్ మై షో అయితే కొత్త డేట్ ని లీక్ చేసింది. ఇందులో జూన్ 12న హరిహర వీరమల్లు చిత్రం బిగ్ స్క్రీన్స్ లో పడనున్నట్టుగా పొందుపరిచారు. దీనితో వీర ఆగమనం ఆరోజు నుంచి ఉంటుంది అని అనధికారికంగా లీక్ అయ్యింది. ఇక దీనిపై మేకర్స్ అధికారిక క్లారిటీ ఏమన్నా ఇస్తారేమో చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.



