ఉగాదికి ‘ఉస్తాద్’ రాక..? బాక్సాఫీస్ బద్దలే ఇక

ఉగాదికి ‘ఉస్తాద్’ రాక..? బాక్సాఫీస్ బద్దలే ఇక

Published on Mar 4, 2026 4:02 PM IST

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి గత ఏడాది వచ్చిన “ఓజి” తర్వాత అభిమానులు అంతా నెక్స్ట్ రానున్న ఉస్తాద్ భగత్ సింగ్ కోసమే ఎదురు చూస్తున్నారు. ఇది మొత్తం మాస్ ఎంటర్టైనర్ కావడంతో అభిమానులతో పాటుగా రెగ్యులర్ ఆడియెన్స్ లో కూడా మంచి బజ్ ఉంది. ఇక ఈ సినిమా రిలీజ్ పరంగా ఇప్పుడు ఊహించని రీతిలో సమీకరణాలు మారుతున్నట్టు తెలుస్తుంది.

మేకర్స్ నిజానికి ఈ సినిమాని మార్చ్ 26కి లాక్ చేశారు. కానీ ఇప్పుడు మరో వారం ముందే వచ్చేస్తుంది అన్నట్టు కొత్త టాక్ మొదలైంది. మార్చ్ 19 ఉగాది రేస్ లో మన తెలుగు స్టేట్స్ లో టాక్సిక్, దురంధర్ 2 సినిమాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రాల్లో ఆల్రెడీ టాక్సిక్ వాయిదా పడింది. అలాగే ధురంధర్ 2 కూడా కొంచెం అటు ఇటుగా అంటున్నారు.

సో ఉస్తాద్ రాక మాత్రం ఈ ఉగాదికే ఉండొచ్చు అని ఆల్రెడీ సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పంపిణీదారులకి కూడా సమాచారం ఇచ్చినట్టు టాక్. సో ఉస్తాద్ భగత్ సింగ్ పై అధికారిక అనౌన్సమెంట్ ఒక్కటి రావాల్సి ఉంది. ఇదే నిజమై ఉగాది రేస్ లో వస్తే మాత్రం పోటీ లేకపోవడంతో ఉస్తాద్ భగత్ సింగ్ కి బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ గ్యారెంటీ అని చెప్పొచ్చు.

తాజా వార్తలు