RAPO22 టైటిల్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్

RAPO22 టైటిల్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్

Published on May 8, 2025 6:00 PM IST

rapo

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తుండగా RAPO22 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ రూపొందుతోంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

ఈ సినిమా నుంచి ఇప్పుడు మేకర్స్ ఓ సాలిడ్ ట్రీట్ అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను మే 15న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో ఈ సినిమాకు ఎలాంటి ఇంట్రెస్టింగ్ టైటిల్ పెడతారా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో రామ్ సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాలో వారిద్దరి కెమిస్ట్రీ ఏ విధంగా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి మెర్విన్-వివేక్ ద్వయం సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు